: రైల్వే రాకపోకలపై ప్రభావం చూపనున్న హుదూద్ తుఫాన్
హుదూద్ తుపాన్ రైళ్ల రాకపోకలపై పెను ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్లను దారి మళ్లించగా, పెద్ద సంఖ్యలో రైళ్ల ను రద్దు చేసింది. మొత్తం 27 ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు, 10 ప్యాసింజర్ సర్వీసులను నిలిపివేశారు. 31 రైళ్ల ను దారి మళ్లించారు. మరోవైపు తుపాను ప్రభావం అధికంగా ఉండనుందని భావిస్తున్న ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ పేర్కొంది.