: డిజిటల్ ఇండియాపై జుకెర్ బర్గ్ అమితాసక్తి: ప్రధాని మోడీ
ఇటీవల ప్రారంభమైన డిజిటల్ ఇండియాపై ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు అమితాసక్తి కనబరచారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం తనతో భేటీ అయిన సందర్భంగా జుకెర్ బర్గ్, డిజిటల్ ఇండియాపై ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచారని మోడీ ఫేస్ బుక్ పోస్టింగ్ లో వెల్లడించారు. ‘‘డిజిటల్ ఇండియా పథకంపై జుకెర్ బర్గ్ అమితాసక్తి ప్రదర్శించారు. దీంతో ఏఏ అంశాల్లో భారత ప్రభుత్వానికి ఫేస్ బుక్ సహాయం చేయగలదన్న విషయాన్ని గుర్తించాలని ఆయనను కోరాం. పర్యాటకంలో మెరుగైన అవకాశాలున్న భారత్ కు విశ్వవ్యాప్తంగా ప్రచారం కల్పించండని కూడా జుకెర్ బర్గ్ ను కోరాం’’ అని మోడీ తన ఫేస్ బుక్ పేజీ లో పేర్కొన్నారు.