: ఐఏఎస్, ఐపీఎస్ ల పంపకాలు పూర్తయ్యాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అఖిలభారత సర్వీసు అధికారుల పంపకాలు పూర్తయ్యాయి. డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకాలు పూర్తి చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ కొంత మంది అధికారులు తమకే కావాలని కేంద్రానికి సూచించారు. వీరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ పంపకాలు పూర్తి చేసినట్టు సమాచారం.