: నోబెల్ తో కోట్లాది మంది బాలల గొంతు ప్రపంచం వింది: కైలాష్ సత్యార్థి


నోబెల్ బహుమతి లభించడం తనను ఆనందానికి గురి చేసిందని విదిష ప్రాంతానికి చెందిన కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. నొబెల్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నోబెల్ బహుమతి ప్రకటించడం ద్వారా కోట్లాది మంది బాలల గొంతు ప్రపంచం విందని అర్థమైందని అన్నారు. రెండున్నర దశాబ్ధాలుగా బాలల హక్కులకు కృషి చేస్తున్నందుకు తనకు గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. గాంధేయవాదంతో శాంతియుత ఆందోళనల ద్వారా బాలల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా నోబెల్ కమిటీ ఆయనను కీర్తించింది. భారత్, పాకిస్థాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు మలాలాతో కలసి పని చేస్తానని సత్యార్థి ప్రకటించారు. రెండు దేశాల్లోని బాలల హక్కుల కోసం కలిసి పనిచేద్దామని మలాలాలను అడుగుతానని ఆయన తెలిపారు. మలాలా తనకు వ్యక్తిగతంగా తెలుసని, రెండు దేశాల్లో బాలల హక్కులు, ముఖ్యంగా బాలికల విద్య కోసం కలసి పోరాటం చేద్దామని మలాలాను పిలుస్తానని ఆయన వెల్లడించారు. రెండు దేశాల్లో శాంతి నెలకొనడం బాలల భవిష్యత్ కు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News