: మహిళను ఫోటోలు తీసిన కానిస్టేబుల్ పై కేసు
గుంటూరు జిల్లా మాచర్ల ఎస్కార్ట్ కానిస్టేబుల్ అశోక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన అశోక్ అక్కడ స్నానం చేస్తున్న మహిళను ఫోటోలు తీశాడు. దీంతో బాధితురాలు కొత్తపేట పోలీసులను ఆశ్రయించింది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.