: నేను టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నా!: టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి


మరో టీడీపీ నేత సైకిల్ దిగి, కారెక్కనున్నారు. వరంగల్ జిల్లా పరకాల టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. వరంగల్ జిల్లా హన్మకొండలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలు, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. దీంతో టీడీపీకి రెండు రోజుల్లోనే మరోసారి షాక్ తగిలింది.

  • Loading...

More Telugu News