: కేసీఆర్ కుటుంబం చెబితేనే ఫైల్ కదులుతుంది: రేవంత్ రెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబం అనుమతి లేనిదే మంత్రులు ఏ దస్త్రంపైన సంతకం పెట్టే పరిస్థితి లేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళకైనా స్థానముందా? అని ప్రశ్నించారు. చంద్రబాబును తిడుతూ కూర్చుంటే కరెంట్ వస్తుందా? అని ఆయన నిలదీశారు. పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని ఆయన సూచించారు. కరవులో కూడా బాబు 9 గంటల విద్యుత్ ఇచ్చారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకోవాలని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News