: మీకు తెలుసా... నోబెల్ శాంతి బహుమతి విశేషాలు!
నోబెల్ శాంతి బహుమతిని ఆల్ఫ్రెడ్ నోబుల్ పేరిట 1901లో ప్రారంభించారు. ఐదు నోబెల్ బహుమతుల్లో నాలుగింటిని స్వీడిష్ కమిటీలు ఇస్తుండగా, శాంతి బహుమతిని మాత్రం నార్వేజియన్ కమిటీ అందజేస్తుంది. ఆల్ఫ్రెడ్ నోబుల్ వీలునామా ప్రకారం ఈ ఏర్పాటు జరిగింది. దానికి కారణం నోబెల్ ఎక్కడా వివరించలేదు. నోబెల్ వర్ధంతి రోజున అంటే డిసెంబర్ 10న లండన్ లో శాంతి బహుమతి అందజేస్తారు. 1901 నుంచి 2014 వరకు 128 మందికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి బహుమతి గ్రహీతల్లో 16 మంది మాత్రమే మహిళలు వుండడం విశేషం. రెండు సార్లు నోబెల్ బహుమతిని ముగ్గురేసి పంచుకున్నారు. లెడ్యూతో అనే విజేత నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించారు. ముగ్గురు నోబెల్ ప్రైజ్ విజేతలు బహుమతి ప్రకటించిన సమయంలో జైలులో ఉన్నారు.