: పాక్ నోటిని భారత జవాన్లు మూసేశారు: మోడీ
గత మూడు రోజుల పాటు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్ నోటిని భారత జవాన్లు తిరుగు కాల్పులతో సమర్థంగా మూసేశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దాంతో, ఆ దేశం సరయిన గుణపాఠం నేర్చుకుందన్నారు. ఇక, తిరిగి కాల్పులకు దిగేందుకు సాహసించరని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని చెప్పారు. కాగా, కాల్పుల కారణంగా ప్రభావితమై వేరే ప్రాంతాలకు వెళ్లిన, గ్రామాల్లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కొన్న జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల వారికి కేంద్రం నుంచి తప్పకుండా పరిహారం ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. పాక్ దూకుడు చర్యల పట్ల ప్రభుత్వం స్పందించిన విధానంపై కాంగ్రెస్ విమర్శించడాన్ని పీఎం ఖండించారు.