: ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో, స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు తెరలేపింది. ఈరోజు 9 మంది స్మగ్లర్లపై ఆ యాక్టు అమలుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వారంతా ఏడాది పాటు జైల్లో ఉండనున్నారు. వారంతా చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, చిత్తూరు ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లని తెలుస్తోంది.