: మలాలా పాకిస్థాన్ కు గర్వకారణం: నవాజ్ షరీఫ్
నోబెల్ శాంతి పురస్కారం పొందిన పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ ను ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అభినందించారు. ఆమె పాకిస్థాన్ కే గర్వకారణమని ఈ సందర్భంగా ప్రశంసించారు. "మలాలా పాకిస్థాన్ కే గర్వకారణం. దేశ పౌరులను గర్వపడేలా చేసింది. తను సాధించింది అసమానమైనది, అనన్య సమానమైంది. ప్రపంచంలోని బాలికలు, బాలురు మలాలా పోరాటాన్ని, నిబద్ధతను స్పూర్తిగా తీసుకోవాలి" అని ఏఎఫ్ పీకి పంపిన ప్రకటనలో పేర్కొన్నారు.