: లొంగిపోవాలని హర్యానా మాజీ సీఎంకు కోర్టు ఆదేశం


హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్ డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాకు ఎదురుదెబ్బ తగిలింది. రేపు అధికారుల ముందు ఆయన లొంగిపోవాలని ఢిల్లీ హైకోర్డు ఆదేశించింది. చౌతాలా బెయిల్ రద్దు చేయాలని కోర్టును సీబీఐ కోరడంతో పైవిధంగా స్పందించింది. ఉపాధ్యాయుల నియామక అవకతవకల కేసులో చౌతాలాకు గతేడాది జనవరిలో ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన ఆయన ప్రస్తుతం బయట ఉన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో, సీబీఐ అధికారులు బెయిల్ రద్దు చేయించారు.

  • Loading...

More Telugu News