: ఎవరీ కైలాస్ సత్యార్ధి? అతనికి నోబెల్ ఎలా వచ్చింది?


ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతికి ఎంపికైన భారతీయుడు కైలాశ్ సత్యార్థి ఎవరు? ఆయనకు నోబుల్ శాంతి బహుమతి ఎలా వచ్చింది? ఈ వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన కైలాస్ సత్యార్థి ఓ సామాజిక ఉద్యమకారుడు, సేవా తత్పరత మెండుగా ఉన్న వ్యక్తి. 'బచ్ పన్ బచావో ఆందోళన్' సంస్థను స్థాపించి బాలల హక్కుల కోసం విశేష కృషి చేశారు. మురికివాడల బాలల కోసం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం తీవ్ర పోరాటాలు చేశారు కైలాశ్ సత్యార్థి. మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేస్తున్న ఈయన, న్యూఢిల్లీలో ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. సత్యార్థి సేవలు మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కానప్పటికీ, ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. కైలాశ్ సత్యార్ధి తన పోరాటాల ఫలితంగా 80 వేల మంది బాలలకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. 'బచ్ పన్ బాచావో ఆందోళన్' సంస్థ ద్వారా అనాథ బాలలకు పునరావాసం, విద్య అందిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలల హక్కుల కోసం చేసిన పోరాటాలకు గుర్తింపుగా పలు అంతర్జాతీయ అవార్డులు ఆయన కీర్తికిరీటంలో ఒదిగిపోయాయి.

  • Loading...

More Telugu News