: సరిహద్దు వెంట కమ్యూనిటీ బంకర్లు: జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ తెగబడుతున్న దుశ్చర్యలకు సామాన్య ప్రజలు బలి కాకుండా ఉండేందుకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. పాక్ సరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ బంకర్లను నిర్మించడం ద్వారా సామాన్యులను కాల్పుల బారి నుంచి రక్షించవచ్చని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా సరిహద్దు వెంట ఉన్న గ్రామాల్లో కమ్యూనిటీ బంకర్లను నిర్మించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదేని సమయంలో పాక్ కాల్పుల శబ్ధం వినిపిస్తే, గ్రామంలోని వారంతా సదరు బంకర్ లో తలదాచుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటారన్నమాట. ఒమర్ అబ్దుల్లా ఐడియా ఆయా గ్రామాల ప్రజలకు బాగానే ఉపయోగపడనుంది.