: టుస్సాడ్స్ మ్యూజియంలో కత్రినా మైనపు బొమ్మ!
లండన్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడం టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో త్వరలో కత్రినా కైఫ్ మైనపు బొమ్మ కొలువు దీరనుంది. ఈ మేరకు మ్యూజియంలో పెట్టనున్న తన వాక్స్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు రావాలంటూ అధికారులు ఆమెను ఆహ్వానించారట. ఆ క్రమంలో వివరంగా మెయిల్ ద్వారా మ్యూజియం అధికారులు విషయాన్ని తెలిపారట. అందుకు కేట్ కూడా వెంటనే తిరుగు సమాధానం పంపిందట. కాగా, దీనికి సంబంధించి కత్రినా నుంచిగానీ, మ్యూజియం అధికారుల నుంచిగానీ ఎలాంటి ధృవీకరణ రాలేదు. బాలీవుడ్ అందాల భామలు ఐశ్వర్యారాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, మాధురీ దీక్షిత్ తర్వాత కత్రినా బొమ్మ ఉండనుండటం విశేషం.