: రసాభాసగా ఆర్టీసీ పాలక మండలి భేటీ
నేడు జరిగిన ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సంస్థ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి జవహర్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన నివేదిక ఈ గందరగోళానికి దారి తీసింది. నివేదికపై తెలంగాణకు చెందిన మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ల నేతలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు భేటీలో రసాభాసకు దారితీశాయి. ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన కన్సల్టెన్సీ నివేదిక తప్పులతడకగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. రెండు ప్రధాన కార్మిక సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో అధికారులు సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు.