: మోహిత్ శర్మకు గాయం... మిగతా వన్డేలకు ఇషాంత్ శర్మ
సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ మరోసారి పిలుపందుకున్నాడు. యువ బౌలర్ మోహిత్ శర్మ గాయపడడంతో విండీస్ తో మిగతా నాలుగు వన్డేలకు అతని స్థానంలో ఇషాంత్ ను ఎంపిక చేశారు. మోహిత్ శర్మ మోకాలి కింది భాగంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడని, దీంతో, ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతని స్థానాన్ని ఇషాంత్ తో భర్తీ చేయాలని నిర్ణయించిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, విండీస్ తో జరిగిన తొలి వన్డేలో మోహిత్ విఫలమయ్యాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో, భువనేశ్వర్ కు సహకారం అందించే మరో పేస్ బౌలర్ లేక టీమిండియా ఆ మ్యాచ్ లో ఇక్కట్లు ఎదుర్కొంది.