: క్లాష్ వస్తుందనే ఐఎస్ఎల్ జట్టును వద్దనుకున్నా: సల్మాన్ ఖాన్


భారత్ లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమవుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో జట్టును సొంతం చేసుకునే ఆలోచనేదీ లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పష్టం చేశాడు. లీగ్ లో ఫ్రాంచైజీ తీసుకుంటే, తన ఒప్పందాలకు విఘాతం కలుగుతుందని తెలిపాడు. తన మిత్రులు ధీరజ్, కపిల్ వధావన్ ఎఫ్ సీ పుణే ఫ్రాంచైజీ కొనుగోలు చేశారని, తననూ భాగస్వామ్యం తీసుకోవాలని కోరారని సల్మాన్ వెల్లడించాడు. అయితే, ఇతర ఒప్పందాల కారణంగా తాను అందుకు అంగీకరించలేదని చెప్పాడు. తాను సుజుకి, థమ్సప్ లతో ఒప్పందం కుదుర్చుకున్నానని, తాను ఫ్రాంచైజీలో భాగస్వామిగా చేరితే ఐఎస్ఎల్ అధికారిక స్పాన్సర్లతో క్లాష్ వస్తుందని సల్మాన్ వివరించాడు. అందుకే ఎఫ్ సీ పుణేతో భాగస్వామ్యం దిశగా అడుగేయలేకపోయానని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News