: తుపాన్ కారణంగా రేపు విశాఖ విద్యాసంస్థలకు సెలవు
'హుదూద్' తుపాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో విశాఖలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటించారు. మరోవైపు ఇతర జిల్లాల్లోనూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.