: విశాఖ వైపు దూసుకొస్తున్న హుదూద్ తుఫాను


తీవ్ర విధ్వంసం సృష్టిస్తుందని భావిస్తున్న హుదూద్ తుఫాను విశాఖ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరి కొద్ది గంటల్లో హుదూద్ పెను తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం నుంచి హుదూద్ తన ప్రతాపాన్ని చూపనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను తీవ్రత దృష్ట్యా ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విశాఖకు చేరుకున్నాయి. తీర ప్రాంతంలోని 10 మండలాల్లోని 50 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News