: నేను భయపడలేదు... ప్రలోభాలు లేవు: తీగల కృష్ణారెడ్డి


తాను ఎవరికీ భయపడలేదని, అలాగే తనను ఎవరూ ప్రలోభపెట్టలేదని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధన కోసమే తాను పార్టీ మారానని అన్నారు. టీడీపీ తనకు సముచిత గౌరవమిచ్చిందని ఆయన తెలిపారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యత సక్రమంగా నిర్వర్తించానని ఆయన చెప్పారు. అయితే, తెలంగాణలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి సహకరించాలని తాను పార్టీ మారానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారడంలో బాధ ఉన్నప్పటికీ, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే తాను పార్టీ మారానని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News