: ఇదో వేలం వెర్రి... నగ్న సెల్ఫీలు పెరిగిపోతున్నాయి!
యువత దేనినైనా అనుసరిస్తే వేలంవెర్రిగా అనుసరిస్తారని ఓ అధ్యయనం తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ, ఫోన్ కు కెమెరాను అనుసంధానం చేయడంతో సెల్ఫీలపై ఎక్కడ లేని మోజు పెరిగిపోతోంది. దీంతో నగ్న సెల్ఫీలు తీసుకుని కొందరికి పంపడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. ఈ సెల్ఫీల మోజు తల్లిదండ్రులతో పాటు టీచర్లను కూడా ఇబ్బంది పెడుతోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆప్ ఉటా చేసిన అధ్యయనంలో తేలింది. స్మార్ట్ ఫోన్లతో ఇలాంటి అసభ్య సెల్ఫీలు తీసుకుని పంపడాన్ని 'సెక్సింగ్' అంటారు. ఈ ప్రవర్తన టీనేజర్లలో పెరిగిపోయిందని ఈ యూనివర్సిటీ వెల్లడించింది. హైస్కూలు స్థాయి చదువుతున్న దాదాపు 1130 మందిని ఈ బృందం సర్వే చేయడంతో పలు ఆసక్తికర విశేషాలు వెల్లడయ్యాయి. తాము నగ్నసెల్ఫీలు తీసుకుని వేరేవాళ్లకు పంపినట్టు 20 శాతం మంది చెప్పగా, తాము నగ్న సెల్ఫీలు అందుకున్నామని 38 శాతం మంది చెప్పారని అధ్యయనం తెలిపింది. అలా అందుకున్న వారు ప్రతి ఐదుగురిలో ఒకరు ఆ ఫోటోలను ఇతరులకు ఫార్వర్డ్ చేశారట. అలా పంపిన వారు, అందుకున్న వారిలో స్త్రీ పురుషుల సంఖ్య సమానంగా ఉందని అధ్యయనం వెల్లడించింది. ఫార్వర్డ్ చేసే వాళ్లలో పురుషులే అధికంగా ఉన్నారు. నగ్న సెల్ఫీలు పంపేవారిలో పురుషులు 24.2% ఉంటే, స్త్రీలు 13% ఉన్నారట.