: శ్రుతి హాసన్ ని పొగిడేసిన హృతిక్...స్పందించని సల్మాన్


'మీరు మీ మతాన్ని అనుసరించండి, అలాగే అందర్నీ ప్రేమించండి' అంటూ ఓ ప్లకార్డు మీద సందేశం రాసి పట్టుకున్న ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని, అతనికి ఓ హగ్ ఇచ్చి, ఓ 30 సెకెన్ల పాటు అతను పట్టుకున్న ప్లకార్డును పట్టుకుని నిలబడగలవా? అంటూ శ్రుతిహాసన్ కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 'బ్యాంగ్ బ్యాంగ్' ఛాలెంజ్ విసిరాడు. హృతిక్ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని శ్రుతిహాసన్ పేర్కొంది. హృతిక్ రోషన్ ముంబయ్ రోడ్డుపై వెళ్తున్నప్పుడు అలా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి ఆయనకు చాలా సార్లు కనపడ్డాడట. అతని ఫోటోను కూడా హృతిక్ రోషన్ శ్రుతిహాసన్ కు పంపాడు. అతను ఏ ప్రయోజనం ఆశించకుండానే ఉత్తమ ప్రపంచం కోసం అలా ప్లకార్డు పట్టుకుని కొన్ని గంటల పాటు అలాగే నిల్చుంటాడట. ఈ విషయం హృతిక్ తెలిపాడు. హృతిక్ రోషన్ అలా చెప్పాడో, లేదో ఇలా ఆమె అంగీకరించడంతో అసలైన రాక్స్టార్ అంటే శ్రుతిహాసనే అంటూ హృతిక్ ఆమెను ఆకాశానికెత్తేశాడు. ఈ 'బ్యాంగ్ బ్యాంగ్' ఛాలెంజ్ లో బాలీవుడ్ తారలు అమీర్ఖాన్, రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా స్వీకరించారు. కానీ హృతిక్ స్నేహితుడని బాలీవుడ్ లో పేరున్న కండల వీరుడు సల్మాన్ఖాన్ మాత్రం ఆ ఛాలెంజ్ స్వీకరించలేదు. 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా విడుదలకు ముందే ఒక సందేశాన్ని పెయింట్ చేయాలని హృతిక్ అప్పట్లో సవాలు చేశాడు. దానికి సల్లూభాయ్ నుంచి సమాధానమే కరవైంది.

  • Loading...

More Telugu News