: ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థిగా శోభానాగిరెడ్డి కుమార్తె
ఆళ్లగడ్డ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దివంగత శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. దీంతో త్వరలో జరగనున్న ఆళ్లగడ్డ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టి అధినేత జగన్మోహన్ రెడ్డిని భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ కలిశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కారు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించడంతో ఆళ్లగడ్డలో ఉపఎన్నిక జరగనుంది.