: కడియం శ్రీహరిలా నేను రాజకీయ వ్యభిచారిని కాదు: ఎర్రబెల్లి
ప్రాణం పోయినా తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని టీటీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కడియం శ్రీహరిలా తాను పార్టీలు మార్చే రాజకీయ వ్యభిచారిని కానని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ మొదట ప్రలోభపెడుతున్నారని...అప్పటికీ కుదరకపోతే బెదిరించి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.