: మోడీని ప్రధానిగా భావించాల్సిన పనిలేదు: రాహుల్ గాంధీ


ప్రధాని మోడీని రాహుల్ గాంధీ అంత మాటన్నారా? అవునండీ, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాహుల్ గాంధీ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు దేశ ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీని ప్రతిపక్ష నేతగానే పరిగణించాలని తన పార్టీ శ్రేణులతో పాటు మహారాష్ట్ర ప్రజలకు సూచించారు. కొన్ని రోజులుగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ, నిత్యం కాంగ్రెస్, ఆ పార్టీ కీలక నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్ గఢ్ వచ్చిన రాహుల్ గాంధీ నేరుగా ప్రధానినే లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలకు దీటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ పాలనలో దేశం ఏ విధంగానూ అభివృద్ధి చెందలేదని చెబుతున్న నేతల మాదిరిగానే మోడీ కూడా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసేవారు ప్రతిపక్ష నేతలు కాక మరెవరంటూ రాహుల్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News