: ఫోర్బ్స్ 'అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్' జాబితాలో ధోనీ


ఫోర్బ్స్ 'ప్రపంచ అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్' జాబితాలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు. మొత్తం పదిమంది అథ్లెట్ల జాబితాలో 20 మిలియన్ల అమెరికన్ డాలర్లతో ఈ ధనాధన్ క్రికెటర్ ఐదవ ర్యాంకులో ఉన్నాడు. విశేషమేంటంటే జాబితాలో భారత్ నుంచి ధోనీ ఒక్కడే ఉన్నాడు. 2013లో బ్యాట్ స్పాన్సర్షిప్స్ స్పార్టన్ స్పోర్ట్స్, అమిటీ విశ్వవిద్యాలయంకు అంబాసిడర్ గా ఉన్న ధోనీ ప్రతి ఏటా నాలుగు మిలియన్ల డాలర్లు పొందాడని ఫోర్బ్స్ తెలిపింది. దానికి ముందు రీబాక్ సంస్థ ప్రచారకర్తగా ఒక మిలియన్ డాలర్ పుచ్చుకున్నాడట. ఇక ఈ జాబితాలో టాప్ లో అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు లెబ్రోన్ జేమ్స్, గోల్ఫర్ టైగర్ ఉడ్స్, టెన్నిస్ స్టార్లు రోజర్ ఫెదరర్ నిలిచారు.

  • Loading...

More Telugu News