: నేడు భారత్ కు రానున్న ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకెర్ బర్గ్
ఫేస్ బుక్ వ్యవస్థాకుడు మార్క్ జుకెర్ బర్గ్ నేడు భారత్ రానున్నారు. ఇంటర్నెట్.కామ్ పై రెండు రోజుల ఫాటు న్యూఢిల్లీలో జరగనున్న సదస్సులో ఆయన పాల్పంచుకోనున్నారు. ఫేస్ బుక్ కు మార్కెట్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు నెలల క్రితం సంస్థ సీఓఓ షెరిల్ శాండ్ బర్గ్ భారత్ లో పర్యటించారు. మార్క్ జుకెర్ బర్గ్, తన భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అమెజాన్.కామ్ చీఫ్ జెఫ్ బెజోస్ ల పర్యటన తర్వాత భారత్ లో జరగనున్న జుకెర్ బర్గ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్. కామ్ లు రెండూ, భారత్ లో తమ క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జుకెర్ బర్గ్ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.