: 'ఇసిస్'లో 10 వేల మంది మహిళా సైనికులు!
ఇరాక్, సిరియాల్లో క్షణక్షణానికి విస్తరిస్తున్న ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఇసిస్) క్రూరత్వానికి మారు పేరు. వందలాది మంది ఇరాక్ సైనికులపై ఒకేసారి హత్యాకాండకు పాల్పడి తన కరడుగట్టిన నైజాన్ని చాటుకుంది. అంతేకాక అమెరికా, బ్రిటన్ లకు చెందిన పౌరుల తలలు తీసి దారుణంగా హతమార్చి, సదరు వీడియోలను విశ్వవ్యాప్తంగా విడుదల చేసి క్రూరత్వానికి పరాకాష్ఠ తానేనంటూ వెల్లడించింది. వినేందుకే భయంకరంగా ఉన్న ఈ తరహా ఘోరాలకు పాల్పడుతున్న 'ఇసిస్'లో పెద్ద సంఖ్యలో మహిళా సైనికులు కూడా ఉన్నారట. దాదాపు 10 వేల మంది మహిళలు యుద్ధ విద్యల్లో ఆరితేరి ఇసిస్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇసిస్ లోని మహిళా సైనికులంతా 20 ఏళ్ల లోపు యువతులేనని వార్తలు వినవస్తున్నాయి. వీరంతా కుర్దూ తెగకు చెందిన మహిళలేనట!