: హైదరాబాద్ లో దారుణం: 11 ఏళ్ల బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన దుండగులు


హైదరాబాద్ నగరంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడిపై కిరోసిన్ పోసిన గుర్తు తెలియని వ్యక్తులు, అతడిని మంటలకు ఆహుతి చేసేందుకు యత్నించారు. మెహిదీపట్నంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనిక నివాస ప్రాంతాల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. 90 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రికి చేరిన ఆ బాలుడు, తనపై జరిగిన దాడికి ఓ మిలిటరీ వ్యక్తే కారణముంటూ వాంగ్మూలమిచ్చాడు. బుధవారం మధ్యాహ్నమే ఈ ఘటన జరుగగా, రాత్రి దాకా ఈ విషయం బయటకు పొక్కలేదు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. సైనికులుండే ప్రాంతంలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో దర్యాప్తులో స్థానిక పోలీసులకు అన్నివిధాల సహకరిస్తున్నామని భారత సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు.

  • Loading...

More Telugu News