: విఫలమైన టాపార్డర్...టీమిండియా 100/4


కోచిలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాపార్డర్ విఫలమైంది. 322 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడారు. నిలదొక్కుకుంటున్న దశలో ఊహించని రీతిలో రహానే (24) రన్ ఔట్ గా వెనుదిరగడంతో భారత జట్టు కష్టాలు ప్రారంభమయ్యాయి. తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కేవలం రెండు పరుగులే చేసి స్లిప్పులో దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు కాస్త కుదురుకుంటున్నాడనుకునేంతలో అనవసర షాట్ కొట్టి బెన్ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా పరుగులేమీ చేయకుండానే బౌల్డయ్యాడు. దీంతో నిలకడగా ఆడుతున్న థావన్ (45)కు ధోనీ (6) జత కలిశాడు. దీంతో 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News