: తీరం దాటి పెనుతుపానుగా మారనున్న హదూద్
ఉత్తర అండమాన్ సముద్రంలో హుదూద్ తుపాను ఏర్పడింది. అండమాన్, నికోబార్ దీవుల వద్ద ఇది తీరం దాటింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న హుదూద్ తుపాను ఒడిశాలోని గోపాల్ పూర్ కు ఆగ్నేయ దిశలో 1010 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్టణానికి 1050 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో ఉంది. ఇది క్రమంగా పశ్చిమంగా ప్రయాణించి, మరో 36 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.