: విజయవాడ, విశాఖ, తిరుపతి మెట్రోపై డీఎంఆర్ సీ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి పట్టణాల్లో చేపట్టనున్న మెట్రోరైల్ ప్రాజెక్టుపై డీఎంఆర్ సీని నియమించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి డీఎంఆర్ సీ ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఆర్ సీ మూడు పట్టణాల్లో మెట్రోరైల్ నిర్మాణానికి మార్గాలు, భూసేకరణ, అంచనా వ్యయం, సాధ్యాసాధ్యాలు వంటివాటిపై సమగ్ర నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించనుంది.