: ఇకపై ఫేస్ బుక్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చు
ఫేస్ బుక్ ఖాతా దారులకు ఓ కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఫేస్ బుక్ అకౌంట్ నుంచి నగదు బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. కొత్త మొబైల్ సోషల్ వాలెట్ 'హాట్ రెమిట్' అందుబాటులోకి రానుంది. డిజిట్ సెక్యూర్ సంస్థ ఈ కొత్త సోషల్ వాలెట్ ను ప్రారంభించింది. హాట్ రెమిట్ ఈ-వాలెట్ సర్వీస్ ద్వారా ఫేస్ బుక్ ఖాతాదారులు నగదు బదిలీ చేసుకోవచ్చని డిజిట్ సెక్యూర్ ఛైర్మన్ కృష్ణప్రసాద్ తెలిపారు.