: శామ్యూల్స్ అజేయ సెంచరీ... విండీస్ భారీ స్కోరు 321
కొచ్చిలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కరీబియన్ జట్టు ధాటిగా ఆడింది. శామ్యూల్స్ అద్భుతమైన అజేయ సెంచరీ సాధించడంతో విండీస్ 321 పరుగుల భారీ స్కోరు సాధించింది. శామ్యూల్స్ (126) కు రామ్ దిన్ (61) చక్కటి సహకారమందించడంతో విండీస్ మూడువందల మార్కు దాటింది. భారత బౌలర్లు పేలవమైన ప్రదర్శన చేశారు. భువనేశ్వర్ కుమార్ వికెట్లు తీయనప్పటికీ పరుగులివ్వడంలో పిసినారితనం పాటించగా ఇతర బౌలర్లంతా థారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఎక్స్ ట్రాల రూపంలో 30 పరుగులను సమర్పించుకున్నారు. బౌలర్లలో షమి నాలుగు వికెట్లు తీసి రాణించగా, జడేజా, మిశ్రా చెరో వికెట్ తీశారు. దీంతో టీమిండియా విజయ లక్ష్యం 322 పరుగులు.