: ఇది అలాంటిలాంటి బర్గర్ కాదండోయ్... తినగలరేమో ట్రై చేయండి!


జంక్ ఫుడ్ తినే అలవాటున్న వారు బర్గర్లు భలే ఇష్టంగా తింటారు. బర్గర్ సింపుల్ ఫుడ్ అని పాశ్చాత్య దేశాల్లో భావన. ఆఫీస్ నుంచి బయటకొచ్చి తినేయొచ్చు, నడుస్తూ కూడా బర్గర్ తినేసే వెసులు బాటు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్గర్ మాత్రం అలాంటిలాంటి బర్గర్ కాదండోయ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఎంతనుకుంటున్నారు? ఓ వెయ్యో రెండు వేలో అనుకుంటున్నారా? అయితే మీరు బర్గర్ లో కాలేశారు! అక్షరాలా లక్షా ఎనిమిది వేల నాలుగొందల నలభై ఐదు రూపాయలు! అయితే ఈ మొత్తం (1,100) పౌండ్లలో చెల్లించాలి. ఈ బర్గర్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో ఫాట్ కంటెంట్ సమతుల్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బర్గర్ తయారీలో నాణ్యమైన సగ్గుబియ్యం వినియోగిస్తారు. న్యూజిలాండ్ కొబ్ వాగ్యు గొడ్డుమాంసంను ప్రత్యేకంగా ఎంపిక చేసి బాగా వండుతారు. నలుపు పుట్టగొడుగులతో బర్గర్ లో జ్యూసీ ప్యాక్ లాగా చేసి దానిలో మాంసం పెడతారు. స్మోక్డ్ హిమాలయన్ సాల్ట్ కలిపిన కెనడియన్ ఎండ్రకాయలను ఇరానియన్ సాస్ లో ఉడికిస్తారు. ఈ సిరప్ ను పూతలా చల్లుతారు. బంగారంతో చేసిన ఆకులాంటి పళ్ళెంలో బెలుగ కేవియర్, స్మోక్డ్ బాతుగుడ్డును పెట్టి దానిని బర్గర్ లో పెడతారు. ఇవన్నీ ప్రత్యేక పద్దతుల్లో చేస్తారు. ఈ బర్గర్ తయారు చేయడానికి మూడు వారాలు పట్టింది. దీనిని హెడ్ చెఫ్ క్రిస్ లార్జ్ తయారు చేశారు. ఈ బర్గర్ లండన్ లోని చెల్సియాలో హన్కి టాంక్ రెస్టారెంట్ లో అందుబాటులో ఉంటుంది.

  • Loading...

More Telugu News