: హెలికాప్టర్లు కావాలంటున్న కేసీఆర్, చంద్రబాబు!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సింగపూర్, మలేసియా, న్యూజిలాండ్ తరహాలో అభివృద్ధి చేసేస్తామంటూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రులిద్దరూ, ఎవరికి వారు సౌకర్యాలు కల్పించుకోవడంలో నేనంటే నేను అనే రీతిగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని తాత్కాలిక కార్యాలయానికి 20 కోట్లతో షోకులు చేసుకుని సీఎం చంద్రబాబు విమర్శలపాలు కాగా, వాస్తు పేరట ఆఫీసుకు మార్పులు చేర్పులు చేసి సీఎం కేసీఆర్ విమర్శలపాలయ్యారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక కార్యక్రమాలు చక్కబెట్టేందుకు హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయించగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా హెలికాప్టర్ కొనుగోలుకు నిర్ణయించినట్టు సమాచారం. ప్రతి రాష్ట్రానికి ఒక హెలికాప్టర్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉండేది. రాష్ట్ర విభజన తరువాత అది ఎవరి వాటానో తెలుసుకోకుండా, ఇద్దరు ముఖ్యమంత్రులు హెలికాప్టర్ కొనుగోలుకు సిద్ధపడడం తీవ్ర విమర్శకు కారణమవుతోంది.

  • Loading...

More Telugu News