: జరగదనుకున్న మ్యాచ్ ఆరంభమైంది... తొలి వికెట్ పడింది...విండీస్ 52/1
భారత్, వెస్టిండీస్ మధ్య పోరాటం మొదలైంది. విండీస్ బోర్డు, ఆటగాళ్ల మధ్య పారితోషికంపై వివాదం తార స్థాయికి చేరడంతో ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభానికి సరిగ్గా ఒకరోజు ముందు కొర్రీలు పెట్టారు. దీంతో విండీస్ క్రికెట్ బోర్డు కూడా చేతులెత్తేసింది. ఆటగాళ్ల కోర్కెలు తీర్చేందుకు శతథా ప్రయత్నిస్తున్నామని విండీస్ బోర్డు చెబుతూ బీసీసీఐకి, భాగస్వాములకు క్షమాపణలు కూడా చెప్పేసింది. ఇంతలో విండీస్ ఆటగాళ్లు మళ్ళీ ఆలోచించుకుని, ఇబ్బంది పెడితే తమ బోర్డును పెట్టాలి తప్ప, బీసీసీఐని పెట్టకూడదని భావించి మ్యాచ్ సమయానికి గ్రౌండ్ కి చేరుకున్నారు. దీంతో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా విండీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. పది ఓవర్లు ఆడిన విండీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 52 పరుగులు సాధించింది. స్మిత్ (21), బ్రావో (4) క్రీజులో ఉన్నారు. షమి ఒక వికెట్ తీశాడు.