: ఐసీసీ 'పీపుల్స్ చాయిస్' అవార్డు రేసులో భువనేశ్వర్ కుమార్
భారత పేస్ బౌలింగ్ ఆశాకిరణం భువనేశ్వర్ కుమార్ ఐసీీసీ 'పీపుల్స్ చాయిస్' అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డుకు ఆసీస్ స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్, సఫారీ సూపర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, శ్రీలంక సారథి ఏంజెలో మాథ్యూస్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చార్లోటె ఎడ్వర్డ్స్ కూడా నామినేట్ అయ్యారు. 'పీపుల్స్ చాయిస్' విభాగంలో అభిమానులే విజేతను నిర్ణయిస్తారు. ఇందుకోసం ఆన్ లైన్ ఓటింగ్ ఉంటుంది.