: తమిళనాడులో శాంతిభద్రతలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: డీఎంకే డిమాండ్


మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలవడంతో ఏఐఏడీఎంకే కార్యకర్తలు ప్రతిరోజు నిరసనలు, ఆందోళనలు చేస్తుండడంతో డీఎంకే పార్టీ మండిపడుతోంది. దాంతో, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కరుణానిధి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. అంతేగాక, అన్నా డీఎంకే కార్యకర్తల దాడులకు నిరసనగా పార్టీ కార్యకర్తలు శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపట్టాలని డీఎంకే నిర్ణయించింది. అటు, న్యాయస్థానం జయకు బెయిల్ నిరాకరించడంతో శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు చేసిన దాడులను డీఎంకే పార్టీ తీవ్రంగా ఖండించింది.

  • Loading...

More Telugu News