: మరో ఇమేజ్ పంపిన 'మామ్'... ఇది కలర్ ఫొటో
అంగారకుడిపైకి భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) మరో ఇమేజ్ ను పంపింది. అరుణగ్రహాన్ని పూర్తిస్థాయిలో తన కెమెరాలో బంధించింది. అయితే, గ్రహం దక్షిణ భాగంలో మేఘాలు ఆవరించిన దృశ్యం ఫొటోలో కనిపించింది. సెప్టెంబర్ 24న 'మామ్' అంగారక వాతావరణంలోకి ప్రవేశించడం తెలిసిందే. ఆ మరుసటి రోజే తొలి ఫొటోను భూమికి పంపింది. కాగా, తాజాగా పంపిన ఫొటోను ఇస్రో వర్గాలు ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశాయి.