: 63 బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ ఆర్మీ కాల్పులు... రెండు పాక్ స్థావరాలను ధ్వంసం చేసిన భారత్


ఇండో-పాక్ బోర్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్ ముష్కర సైన్యం జమ్మూ అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న 63 బీఎస్ఎఫ్ పోస్టులపై గత రాత్రి నుంచి కాల్పులకు తెగబడుతోంది. ముఖ్యంగా సాంబా, హీరానగర్, ఆర్ఎస్ పురా, అర్నియా, పర్గ్ వాల్, కనాచక్ సెక్టార్లపై దాడులు చేస్తోంది. పాక్ దాడులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. రెండు దేశాల జవాన్ల మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్థాన్ రేంజర్లు మోర్టార్ షెల్లింగ్ కూడా చేస్తున్నారు. ఈ దాడుల్లో ఒక బీఎస్ఎఫ్ జవానుతో పాటు ఐదుగురు సాధారణ పౌరులు గాయపడ్డారు. రెండు పాకిస్థాన్ స్థావరాలను మన జవాన్లు ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News