: కల్పకం అణువిద్యుత్ కేంద్రంలో కాల్పుల కలకలం... ముగ్గురు జవాన్ల మృతి


తమిళనాడులోని కల్పకం అణువిద్యుత్ కేంద్రంలో కాల్పులు కలకలం రేపాయి. సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్ విజయ్ ప్రతాప్ తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. జవాన్ల మధ్య చెలరేగిన ఘర్షణే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. విజయ్ ప్రతాప్ ను అరెస్ట్ చేశామని కాంచీపురం ఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News