: బెంగళూరు 'యాహూ'లో 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన?


ప్రముఖ ఐటీ దిగ్గజం 'యాహూ' తన బెంగళూరు కార్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. మరింత మెరుగైన సేవలందించడం కోసం, వినియోగదారులకు కొత్తదనాన్ని ఇవ్వడం కోసం కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ వెల్లడించారు. అయితే, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారన్న అంశంపై మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించలేమని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు యాహూ క్యాంపస్ లోని సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్లో 2500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. యాహూ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. చివరకు కేవలం 250 మంది ఉద్యోగులు మాత్రమే కంపెనీలో మిగులుతారని ఓ రిపోర్ట్ చెబుతోంది.

  • Loading...

More Telugu News