: శ్రీకాళహస్తి మినహా మూతపడనున్న అన్ని ఆలయాలు


ఈ రోజు చంద్రగ్రహణం నేపథ్యంలో, శ్రీకాళహస్తి ఆలయం మినహా అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. చంద్రగ్రహణం ఘడియలు సాయంత్రం 4.45 గంటల నుంచి రాత్రి 7.05 వరకు ఉంటాయి. సాధారణంగా గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచే ఆలయాల తలుపులు మూసివేయడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం తలుపులు మూసివేయనున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఉదయం 10 గంటల నుంచి మూసివేస్తారు. శుద్ధి కార్యక్రమాల తర్వాత రాత్రి 9 గంటలకు భక్తుల దర్శనార్థం తలుపులు తెరుస్తారు. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 4 గంటల వరకు మూసివేయనున్నారు. అలాగే యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసి ఉంచుతారు. బాసరలోని సరస్వతీదేవి ఆలయాన్ని ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేస్తారు.

  • Loading...

More Telugu News