: 9 నుంచి మళ్లీ మొదలవుతున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'
'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో రెండవ భాగం మళ్లీ మొదలవుతోంది. ప్రయోగాత్మకంగా తెలుగు బుల్లితెరపై నాగార్జున వ్యాఖ్యానంతో ప్రసారమైన 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు విశేషమైన ఆదరణ లభించడంతో మలిభాగం ప్రసారం చేసేందుకు మాటీవీ సన్నాహాలు చేసింది. దీంతో రెండవ భాగంలో పాల్గొనే ఔత్సాహికుల కోసం నాగార్జున 9 వ తేదీ రాత్రి 7గంటల నుంచి 18వ తేదీ వరకు ప్రతి రోజూ ఓ ప్రశ్న సంధించనున్నారు. దానికి ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాధానమిచ్చే వారు రిజిస్టర్ కానున్నారు. వారిలో కొంతమందిని ఎంపిక చేసి వారిని హాట్ సీట్ పై కూర్చోబెట్టి ఆడించనున్నారు. ఈసారి గెలుపు బహుమతి మొత్తం కోటి రూపాయలు. ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది తెలుగు ప్రజలు వీక్షించిన ఈ గేమ్ షోను ఈసారి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు 17.61 రేటింగ్ వచ్చిన సంగతి తెలిసిందే.