: మంత్రి కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్ లిఫ్ట్ లో ఇరుక్కున్నారు
తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ లు ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. బేగంపేటలోని వరుణ్ మోటార్స్ లో ఓ కొత్త కారును ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్, బాల్క సుమన్ లిఫ్ట్ లో కిందికి దిగుతుండగా మూడవ ఫ్లోర్ లో లిఫ్ట్ స్తంభించింది. సుమారు 5 నిమిషాలపాటు లిఫ్ట్ నిలిచిపోయింది. దాంతో వరుణ్ మోటార్స్ సిబ్బంది, కేటీఆర్ అంగరక్షకులు ఆందోళనకు లోనయ్యారు. సిబ్బంది లిఫ్ట్ బాగు చేసి మూడవ ఫ్లోర్ లో కేటీఆర్ ను బయటికి పంపించారు. దీంతో మూడవ ఫ్లోర్ నుంచి ఆయన అంగరక్షకులు క్షేమంగా కిందకి తీసుకువచ్చారు. దీంతో వరుణ్ మోటార్స్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.