: రేవంత్ రెడ్డి దుర్మార్గుడు: ఈటెల
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి దుర్మార్గుడని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 470 మెగావాట్ల విద్యుత్ ను ఎందుకు ఇవ్వరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అడగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు గత ప్రభుత్వాల పనితీరే కారణమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కరవు నెలకొందని ఆయన తెలిపారు. పెంచిన పింఛన్లు నవంబర్ 2వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.