: తెలంగాణ సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారు: రేవంత్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సామాజికవర్గ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతూ కేసీఆర్ కుటుంబం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. తెలంగాణ వారసత్వ సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని ఆరోపించారు. దొరకు దోచిపెట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఎద్దేవా చేశారు. మీడియా వ్యవస్థను లోబరుచుకుని పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వేసుకున్న సెంటిమెంట్ ముసుగు తొలగిపోయిందని... ఇకపై టీఆర్ఎస్ కు కష్టకాలమే అని అన్నారు. మమ్మల్ని ఎంత తిట్టినా పట్టించుకోమని... ప్రజల ఆస్తులను కాపాడటానికి మేము పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికైనా టీఆర్ఎస్ దోపిడీపై మాట్లాడాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News