: బొప్పాయిని ఇష్టపడని వాళ్ళు ఇది తప్పక చదవాల్సిందే!


బొప్పాయి పండు అంటే కొందరు విముఖత ప్రదర్శిస్తారు. కానీ, దీంట్లో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే అర్జెంటుగా దీని అభిమానుల జాబితాలో చేరతారు. విరివిగా లభించే ఈ ఫలం ధర కూడా తక్కువే. ఇలా అన్ని విధాలా అనుకూలమైన బొప్పాయి గురించి తెలుసుకుందాం. దీంట్లో ఉండే పీచు పదార్థం హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పీచు పదార్థం పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తగ్గించడంలోనూ సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అజీర్తితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఇక, ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. హార్ట్ పేషెంట్లు దీన్ని ఎలాంటి అనుమానం లేకుండా స్వీకరించవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ వ్యాధి నిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. క్రమం తప్పకుండా బొప్పాయిని తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందట. ప్రధానంగా స్త్రీలలో బహిష్టు సమయంలో కనిపించే నొప్పుల నుంచి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ఉపశమనం కలిగిస్తుంది.

  • Loading...

More Telugu News